మదనపల్లె: ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఊరి వెలి-ASPకి ఫిర్యాదు.

0
0

సోమల మండలం కందూరు గ్రామానికి చెందిన గౌరి, ఆనంద్ కుమార్ అనే యువకుడిని 2003లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఊరి పెద్దలు శేఖర్, రమణ తదితరులు, కట్టుబాట్లు తప్పారంటూ గౌరి కుటుంబానికి రూ. 20,000 జరిమానా విధించి, వారిని ఊరి నుంచి వెలివేశారు.

తల్లిదండ్రులతో మాట్లాడితే రూ. 5,000 జరిమానా కట్టాలని గ్రామస్తులను నిబంధనలతో భయపెట్టారు. రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నామని, భర్తను దూరం చేశారని గౌరి అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఎదుట గురువారం కన్నీటి పర్యంతమైంది. స్పందించిన ఎస్పీ, వెంటనే చౌడేపల్లి సీఐ, సోమల ఎస్సైలతో మాట్లాడి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.