Home South Zone Andhra Pradesh శ్రీవారి భక్తులకు గమనిక: మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

శ్రీవారి భక్తులకు గమనిక: మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

0

తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 19న ఉగాది పర్వదినం వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17న ‘కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం’ (ఆలయ శుద్ధి) నిర్వహించనున్నందున వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది.

శుద్ధి కార్యక్రమం కారణంగా మార్చి 16, 18 తేదీల్లో సాధారణ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

NO COMMENTS

Exit mobile version