అవినాష్‌కు రాజకీయ పరిపక్వత లేదు: టి.ఎన్.ఎస్.ఎఫ్ నేత దర్షిత్ ఫైర్.

0
0

దేవినేని అవినాష్‌కు రాజకీయ అవగాహన లేదని టి.ఎన్.ఎస్.ఎఫ్ నేత పొట్లూరి దర్షిత్ విమర్శించారు. వరుస ఎన్నికల్లో ఓడిపోయిన అవినాష్, భారీ మెజార్టీతో గెలిచిన ఎంపీ కేశినేని చిన్నిని విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు.

గత ఐదేళ్లలో విజయవాడలో సామాన్యులను దోచుకున్న చరిత్ర వైసీపీ నేతలదేనని మండిపడ్డారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాజకీయంగా తగిన శాస్తి జరుగుతుందని ఆయన హెచ్చరించారు.