అన్నమయ్య జిల్లా: పోలీసుల స్పెషల్ వీడియో

0
1

అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని, సమాజంలో పొంచి ఉన్న ప్రమాదాల పట్ల అప్రమత్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. పాఠశాల బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించే ఈ వీడియోను పోలీసులు రూపొందించారు.