రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో చైల్డ్ సేఫ్టీ మరియు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులకు బాలల సంరక్షణతో పాటు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
సమాజంలో చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, అనుమానాస్పద సంఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని పోలీసుల సూచనలను అడిగి తెలుసుకున్నారు. యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.










