అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11 తేదీలలో సుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి రెండో చాటింపు వేశారు.
ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, నగరి వీధి, జమిందార్ ప్యాలెస్ వద్ద ఆసాది, తోటి, నీరు గట్టు కులస్తులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతరను తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు# కొత్తూరు మురళి.










