పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 12 వరకు పొడగించినట్లు ప్రిన్సిపల్ జయసింహ నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
5వ తరగతి, జూనియర్ కళాశాలలో ప్రవేశానికి అర్హత ఉన్న విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు https: //mjpapbcwreis. apcfss. in సందర్శించాలని సూచించారు. గురుకులంలో పలు వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు
# కొత్తూరు మురళి.










