మదనపల్లె బస్టాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పర్సు చోరీ.

0
0

మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం చిత్తూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఖదీర్ పర్సును గుర్తుతెలియని వ్యక్తులు తస్కరించారు. అందులో రూ. 12,000 నగదు, ఆధార్ కార్డు ఉన్నాయని బాధితుడు ఫిర్యాదు చేశారు.

టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఐ మహమ్మద్ రఫీ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు.