అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా విచ్చేసిన గద్య అనురాధ

0
0

విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన గద్దె అనురాధ మాట్లాడుతూ.. మహిళా సాధికారత కేవలం మాటల్లోనే కాకుండా విద్య ద్వారా చేతల్లో చూపాలని పిలుపునిచ్చారు.

లింగ సమానత్వంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన వాదోపవాద పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆచంటి సునీత అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో SAFE సంస్థ ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మహిళలు తమ సామర్థ్యాన్ని గుర్తించి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యార్థినుల మేధస్సుకు పదును పెట్టేలా సాగిన ఈ కార్యక్రమం విజయవంతమైందని మహిళా సాధికారత కమిటీ ప్రతినిధులు తెలిపారు.