Home South Zone Andhra Pradesh అనాథగా పెరిగి.. దాతల సాయంతో సివిల్స్ సాధించిన రాజశేఖర్.

అనాథగా పెరిగి.. దాతల సాయంతో సివిల్స్ సాధించిన రాజశేఖర్.

0

అన్నమయ్య జిల్లా మదనపల్లి: నిమ్మనపల్లెకు చెందిన గోగులు రాజశేఖర్ యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 920వ ర్యాంకు సాధించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాజశేఖర్, తన అక్క కృష్ణవేణి, మేనమామ, దాతల సహకారంతో ఢిల్లీలో ఎనిమిదేళ్లు కష్టపడి ఈ విజయం సాధించారు.

ప్రస్తుతం వచ్చిన ర్యాంకుతో సంతృప్తి చెందకుండా, తన అసలు లక్ష్యమైన ఐఏఎస్ సాధన కోసం మరోసారి పరీక్ష రాస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నవారికి ఆయన విజయం గొప్ప స్ఫూర్తినిస్తుంది.

NO COMMENTS

Exit mobile version