ఈ తనిఖీలు నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్,ఒంగోలు రైల్వే సీఐ శ్రీ మౌలా షరీఫ్ సూచనలపై, చీరాల జి ఆర్ పి ఎస్.ఐ కొండయ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి నిర్వహించబడినవి.
ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారాలు, రైళ్లలో ప్రయాణికుల సామానులను అనుమానాస్పద వ్యక్తులపై, వస్తువులపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే గంజాయి అక్రమ రవాణా, వినియోగం నివారణపై అవగాహన కల్పిస్తూ పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా నిర్వహించబడింది.గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
ప్రజలు కూడా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు.










