Home South Zone Andhra Pradesh చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

0

జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎండి.మోయిన్ సూచనలతో మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సిఐ ఎస్. సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ పనితీరు,ప్రజలకు పోలీసులు అందించే సేవలను క్షేత్రస్థాయిలో వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను చూపిస్తూ, ఫిర్యాదు ఎలా చేయాలి, ఎఫ్‌ఐఆర్ ఎలా నమోదు చేస్తారు అనే అంశాలపై అవగాహన కల్పించారు.

ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు.ఆపద సమయంలో భయం వీడి పోలీసులను ఎలా ఆశ్రయించాలో తెలియజేస్తూ, మహిళలు మరియు బాలికల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.అంతేకాకుండా, స్టేషన్‌లో అందుబాటులో ఉన్న కమ్యూనికేషన్ పరికరాలు,రికార్డులు,ఇతర సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు ప్రయోగాత్మక వివరణ ఇచ్చారు.పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్న అపోహలను తొలగించి, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడమే ఈ ఓపెన్ హౌస్ ప్రధాన ఉద్దేశమని సిఐ పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version