ప్రజల కోసమే అసెంబ్లీ చర్చలు: ముగింపు ప్రసంగంలో సీఎం చంద్రబాబు.

0
0

ఏపీ అసెంబ్లీ సమావేశాల ముగింపులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విపక్షం లేకున్నా ప్రజల కోసమే చర్చలు జరిగాయన్నారు. గత పాలకుల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని, ఆర్థిక కష్టాల్లోనూ ‘సూపర్ సిక్స్’ పథకాలను విజయవంతం చేశామని తెలిపారు.

కేంద్ర నిధులను మళ్లించి గత ప్రభుత్వం వ్యవస్థలను దెబ్బతీసిందని మండిపడ్డారు. పవన్ కల్యాణ్, మోదీ సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.