చౌడేపల్లి మండలం బోయకొండ రోడ్డు మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెడుగుట్టపల్లెకు చెందిన పాపులమ్మ (60) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.
తన మనవడితో కలిసి సొంత పని నిమిత్తం ఎల్లటూరు వెళ్లి, తిరిగి వస్తుండగా కళ్లు తిరిగి కిందపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది.










