అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ పేరుతో పోలీసులు శనివారం తెల్లవారుజామున రాయచోటి, మదనపల్లె (అంగళ్ళు) ప్రాంతాల్లో భారీ ‘కార్డన్ & సెర్చ్’ నిర్వహించారు.
10 ప్రత్యేక బృందాలు అధునాతన డ్రోన్ కెమెరాల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాలు, ఖాళీ భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. రాయచోటిలో డీఎస్పీ కృష్ణమోహన్, మదనపల్లె రూరల్లో సీఐ రవి నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.










