మదనపల్లెలో వృద్ధురాలి స్థలం కబ్జా.. అండగా నిలిచిన పోలీసులు.

0
0

మదనపల్లెలోని సురభికాలనీలో నివసించే చెంగమ్మ అనే వృద్ధురాలి 2 సెంట్ల ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఆమెకు ఎవరూ లేకపోవడంతో నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు యత్నించగా, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

వెంటనే స్పందించిన పోలీసులు నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేశారు. అనాథ అని చులకనగా చూస్తే ఊరుకోబోమని, కబ్జారాయుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.