జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సరస్వతి, కార్యదర్శిగా ప్రకాష్ నాయుడు నియమితులయ్యారు.
రాష్ట్ర కార్యదర్శి చామంచుల మల్లిక వీరికి నియామక పత్రాలు అందజేశారు. ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు బీసీల సమస్యల పరిష్కారానికి, సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని మల్లిక సూచించారు. నూతన సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.










