చీరాల పట్టణంలో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ‘దివ్యాంగుల గర్జన’ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన దివ్యాంగులు తమ ప్రధాన సమస్య అయిన ‘సొంత ఇంటి’ కల నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నివాస స్థలాలు లేక అద్దె ఇళ్లలో తాము పడుతున్న ఇబ్బందులను ఏఐటియూసీ నాయకుల సమక్షంలో ఏకరువు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే మాలకొండయ్య ఈ విషయంలో చొరవ చూపి దివ్యాంగులకు గృహ వసతి కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా భవిష్యత్ పోరాటాల కోసం నూతన కమిటీలను ఎన్నుకున్నారు. హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామని దివ్యాంగుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. మహిళా దివ్యాంగుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం ఈ సమావేశంలో మరో విశేషం.










