నారీ శక్తికి వందనం: మహిళా ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే.

0
1

నేడు చీరాలలో మహిళా సదస్సు యు టి ఎఫ్ బిల్డింగ్ నందు మహిళా దినోత్సవం ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
అక్కగా, చెల్లిగా, తల్లిగా మహిళలు ప్రతి ఒక్కరి జీవితాల్లో చెరగిపోని ముద్ర వేస్తారు.

టీచర్ గా సేవలందించిన మహిళలను సత్కరించడం ఆనందంగా ఉందని అలాంటి మహిళలను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని మహిళా హక్కుల పరిరక్షణకు ప్రతి పౌరుడూ పాటు పడాలని,ప్రతి మహిళనూ గౌరవించుకోవాలని మహిళా శక్తిని గౌవించుకోవడం

లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘మహాశక్తి’ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడం మహిళల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శమని అన్నారు.ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు ఆటలు పోటీల్లో పాల్గొన్నారు.