చిన్నగంజాంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
కుటుంబానికి వెన్నెముకగా నిలిచే మహిళలు, నేడు దేశాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. చదువుతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, ప్రతి ఆడబిడ్డ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
మహిళల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులకు మరియు డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమం చిన్నగంజాం పరిసరాల్లో పండుగ వాతావరణాన్ని నింపింది.










