మాట తప్పని నేత ఎరిక్షన్ బాబు: కొత్త రోడ్డుతో తీరిన ప్రజల కష్టాలు.

0
0

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు – ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం – హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
యర్రగొండపాలెం పట్టణంలోని 21,22 బూత్ పరిధిలో తహసీల్దార్ కార్యాలయం వెనుక బజారులో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు ₹ 15 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు కు పనులను ప్రారంభించారు.

గతంలో ఎరిక్షన్ బాబు గారు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడి ప్రాంత ప్రజలకు సిమెంట్ రోడ్డు వేయిస్తానని ఎరిక్షన్ బాబు గారు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు సిమెంట్ రోడ్డు ను వేయించి మాట నిలబెట్టుకున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఎరిక్షన్ బాబు గారికి ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ షేక్ మస్తాన్ వలి (మ్యాక్స్) గారు, బూత్ ఇంచార్జ్ దొంతా వెంకట్రావు గౌడ్ గారు, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు…