Home International India act responsibly said U S TREASURY SECRETARY

India act responsibly said U S TREASURY SECRETARY

0

భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి
ఇరాన్‌ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చక్కగా వ్యవహరిస్తోందంటూ అమెరికా కితాబిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఆమోదం తెలిపిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ.. భారత్ బాధ్యతాయుతంగా నడుచుకుంటోందంటూ కితాబిచ్చారు.

భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి
Scott Bessent

ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ సహా పలు దేశాలకు చమురు సమస్యాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందంటూ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్‌కు అనుమతులిస్తున్నట్టు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. స్కాట్‌ ఈ విధంగా స్పందించారు.

‘ప్రపంచ దేశాలకు చమురు సరఫరా బాగానే కొనసాగుతోంది. ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు మిత్ర దేశమైన భారత్‌కు అమెరికా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది’ అని స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ‘భారత్‌ చాలా బాధ్యతగా వ్యవహరించింది. ముందుగా ఆంక్షలున్న రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని మేము కోరాం.

భారత్‌ ఆపివేసింది. ఆ తర్వాత అమెరికా నుంచి చమురు కొనాలని భారత్‌ నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చమురు సరఫరాలో తాత్కాలికంగా లోటు ఏర్పడింది. దాన్ని భర్తీ చేసేందుకు రష్యా చమురును కొనేందుకు మేము భారత్‌కు అనుమతి ఇచ్చాం. త్వరలోనే రష్యా చమురుపై ఉన్న మరికొన్ని ఆంక్షలను కూడా తొలగించవచ్చు’ అని ఆయన చెప్పారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్‌కు ఉపశమనం కలిగించేలా చర్యలు కొనసాగిస్తున్నామని స్కాట్ తెలిపారు.

NO COMMENTS

Exit mobile version