విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరిస్తారన్నారు.
మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
#Boiena Rajesh










