అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆదివారం ప్రారంభించారు
పుంగనూరు టౌన్ లోని వ్యవసాయ మార్కెట్ సముదాయంలో 59 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారితో కలిసి మంత్రి గారు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని
తెలిపారు మార్కెట్ యార్డుకు అభివృద్ధి ద్వారా రైతులు తమ పంటను సులభంగా విక్రయించుకునే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం అని పేర్కొన్నారు










