సూర్యోదయ సంస్థ సేవా స్ఫూర్తి: టెన్త్ విద్యార్థులకు పరీక్షా కిట్ల పంపిణీ!

0
0

కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు ప్రభుత్వ హైస్కూల్లో సూర్యోదయ సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న 93 మంది విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ చేశారు. సుర్ల నాగ రమణ – నాగమణి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కె. సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు.

విద్య ద్వారానే జీవితంలో విజయాన్ని సాధించవచ్చని వారికి ప్రేరణ ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న సూర్యోదయ సంస్థ ప్రతినిధులు విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో భద్రరావు, సూర్యోదయ సంస్థ సెక్రటరీ రొంగల అర్జున్, వర్మ నాయుడు, ప్రసాద్, సురేష్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అవసరమైన పరీక్షా సామగ్రిని అందజేసి వారిని ప్రోత్సహించారు.