మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గారి తక్షణ స్పందన
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని CCC లో గల మున్సిపల్ కార్పొరేషన్ డంప్ యార్డ్ లో వేసవి కాలం తీవ్రత వలన తీవ్రమైన మంటలు చెలరేగాయి.
స్థానిక కార్పొరేటర్,మరియు ప్రజలు మేయర్ గారికి సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న *మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు మంచిర్యాల ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చి ఫైర్ ఇంజన్ ను పిలిపించి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించారు.
వేసవి కాలం లో మంటలు చెలరేగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని ఆదేశించారు.
సత్వరమే సంఘటనపై స్పందించిన మేయర్ గారిని స్థానిక ప్రజలు అభినందించారు
సంఘటన స్థలాన్ని మేయర్ గారితో స్థానిక కార్పొరేటర్ పుట్ట యశోద గారు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,సిబ్బంది పరిశీలించారు.










