రోడ్డులు తవ్వి వదిలేసిన అధికారులు

0
2

అధికారుల ఉదాసీనత వల్ల పట్టణంలోని ప్రధాన రహదారులు మృత్యుపాశాలుగా మారాయి. అభివృద్ధి పనుల నిమిత్తం రోడ్లను తవ్వి నెలలు గడుస్తున్నా, వాటిని పునరుద్ధరించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా వర్షం పడితే ఈ గుంతలు నీటితో నిండి, ఎక్కడ గోతి ఉందో తెలియక ప్రయాణికులు కింద పడి గాయపడుతున్నారు. స్థానిక నివాసితులు అధికారులకు విన్నవించినా ‘రేపు-మాపు’ అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని కోరుతున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.