మదనపల్లె సీటీఎం రోడ్ శివాజీ నగర్‌లో ఆదివారం శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్ పాల్గొన్నారు.
ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.










