అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లిలో ఆదివారం ‘మహిళా వాకథాన్’ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, మహిళలతో కలిసి 2 కిలోమీటర్లు నడిచి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
మహిళా భద్రత పోలీసుల ప్రథమ కర్తవ్యమని, ఆపదలో ఉన్నవారు శక్తి టీమ్స్, 112 సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వాకథాన్ విజేతలకు బహుమతులు అందజేశారు.
