ఆటోను బొలెరో వాహనం ఢీకొన్న ఘటన ఆదివారం రాత్రి పుంగనూరు మండలం, రాంపల్లి వద్ద జరిగింది. స్థానికుల వివరాల మేరకు మదనపల్లి నుంచి పుంగనూరు వైపు వస్తున్న ఆటోను బొలెరో లగేజ్ వాహనం ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 లో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది
# పుత్తూరు మురళి.










