మదనపల్లి మార్కెట్‌లో చిన్న క్రేట్ల విధానం ప్రారంభం.

0
0

మదనపల్లి టమోటా మార్కెట్‌లో సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా 15 కిలోల చిన్న క్రేట్ల విధానాన్ని ప్రారంభించారు. ఈ కొత్త విధానం వల్ల రైతులు అధిక లాభాలు పొందవచ్చని, ఆక్షన్ లేకుండా నేరుగా విక్రయాలు జరుపుకోవచ్చని ఆయన తెలిపారు.

ఈ పద్ధతి వల్ల రైతులు, వ్యాపారులు ఎవరూ నష్టపోరని, రైతులు ఆర్థికంగా లాభపడాలని ఎమ్మెల్యే సూచించారు.