ఎల్బీనగర్‌లో ఏసీబీ షాక్.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఖాకీలు!

0
0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (ఎల్బీనగర్) లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఇద్దరు రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (RSIs) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, జటావత్ బాబు నాయక్ ఒక సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు (నోటీసు ఇచ్చేందుకు) లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.

బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ రేంజ్-2 అధికారులు పథకం ప్రకారం ఎల్బీనగర్ చౌరస్తాలో మాటు వేశారు.
లంచం డబ్బులు తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన స్థానికంగా పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది. నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

#sidhumaroju
Alwal