మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత
గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ దర్నీ మధుకర్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక 39 వ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని *మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు* పర్యవేక్షించారు.
స్థానికులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకొని సిబ్బందికి తగిన సూచనలు తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు డిప్యూటీ మేయర్ శ్రీమతి సళ్ళ రమ్య మహేష్ గార్లు,39 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పుదరి సునీత ప్రభాకర్ గార్లు ,మున్సిపల్ అధికారులు,సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.










