మహిళపై అడవి పంది దాడి.. తీవ్ర గాయాలు
వాంకిడి మండలం సోనాపూర్లో ఆదివారం సాయంత్రం పత్తి ఏరేందుకు వెళ్లిన ఆత్రం ధర్మాబాయి అనే మహిళపై అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ఆమె తల, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు వెంటనే స్పందించి సర్పంచ్కు సమాచారం అందించారు.
సర్పంచ్ పంద్రం సురేష్ స్పందించి, బాధితురాలిని మొదట వాంకిడి ఆసుపత్రికి, ఆ తర్వాత ఆసిఫాబాద్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.










