అంధ ఉపాధ్యాయులకు ఫేస్ అటెండెన్స్ నుంచి మినహాయింపు.

0
0

ఏపీలోని ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం డబుల్ గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో సీపీఎస్ రద్దు పోరాటం సందర్భంగా 73 మంది ఉపాధ్యాయులపై నమోదైన పోలీసు కేసులను హోంశాఖ అధికారికంగా ఎత్తివేసింది.

రెండేళ్ల నిరీక్షణ తర్వాత లభించిన ఈ ఊరటపై ఉపాధ్యాయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, అంధ ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వీరి హాజరును ఇకపై ప్రధానోపాధ్యాయులు లీప్ యాప్ ద్వారా నమోదు చేయనున్నారు. ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఉపాధ్యాయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు.