నెల్లూరు
కావలి పట్టణం శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు యునైటెడ్ కింగ్ డమ్ లో ఉన్న వంశీ తులసి సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేద యువతి కి కుట్టు మిషను పంపిణీ చేశారు. శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
పొన్నగంటి మాధవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వంశీ తులసీ అందించిన సహకారం కు ధన్యవాదాలు తెలిపారు.
మహిళాదినోత్సవం సందర్భంగా ఒక పేద మహిళకు కుట్టు శిక్షణ పూర్తి చేసుకుని ఆర్థిక పరిస్థితుల వలన కొత్త మిషను కొనుగోలు చేసుకోలేని పరిస్థితి లో సుదూర ప్రాంతంలో ఉన్న తులసీ వంశీ కుట్టు మిషను అందించడం అభినందనీయం అని ట్రస్ట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కావలి ప్రాంతంలో మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తూ అర్హులైన పేద మహిళలకు పలువురి సౌజన్యంతో కుట్టు మిషను అందిస్తూ వారి జీవనోపాధి కి సహకరిస్తున్న శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ మాధవి సేవలు మరువలేనివి అని కార్యక్రమంలో పాల్గొన్న , విశ్రాంత బ్యాంకు అధికారి ట్రస్ట్ ప్రతినిధి కమల్,సీనియర్ జర్నలిస్ట్ జయప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.










