మహిళల చట్టాలపై విద్యార్థులకు అవగాహన – బి. హేన సుజన్.

0
0

నెల్లూరు గిరిజన సంక్షేమ గురుకులంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా అధికారిణి బి. హేన సుజన్ మాట్లాడుతూ, విద్యార్థినులు తమ హక్కులు మరియు రక్షణ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ముఖ్యంగా పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం మరియు సఖి కేంద్రాల ప్రాధాన్యతను వివరించారు. ఆపదలో ఉన్నప్పుడు 1098, 112 నంబర్లను ఆశ్రయించాలని కోరారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థినులకు అవగాహన కల్పించడంతో పాటు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.