ఆరోగ్యవరం మిషనరీలో నిధుల దుర్వినియోగం: ఏడుగురిపై కేసు.

0
0

మదనపల్లి ఆరోగ్యవరం సమీపంలోని ఓ క్రైస్తవ మిషనరీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏడుగురిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ చిరంజీవి ఫిర్యాదు మేరకు తాలూకా సిఐ వెంకటరమణ విచారణ చేపట్టారు.

సిండికేటుగా ఏర్పడి నిధులు దారిమళ్లించారన్న ఆరోపణలతో లారెన్స్, అనిస్ మోసెస్, నెల్సన్, రతీశ్, వినీల్, జశ్వంత్ జాన్, దినేన్‌లపై కేసు ఫైల్ చేశారు.