మదనపల్లెలో మల్చింగ్ పేపర్ల విక్రయాలపై ఆకస్మిక సోదాలు.

0
0

మదనపల్లెలో మల్చింగ్ పేపర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మంగళవారం ఉద్యానవన శాఖ అధికారి ఈశ్వరప్రసాద్ రెడ్డి, ఏవో నవీన్ కుమార్ రెడ్డి, సేల్స్ టాక్స్ ఆఫీసర్ సతీష్ నేతృత్వంలో పలు దుకాణాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.

టమాటా సాగుకు మల్చింగ్ షీట్లు అత్యవసరమైన నేపథ్యంలో, వీటిని ఆసరాగా చేసుకుని రైతులను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై సహించేది లేదని స్పష్టం చేశారు.