మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, విలువలతో కూడిన విద్యను అందించడంలో విజయభారతి పాఠశాల ముందుందని అన్నారు. బుధవారం పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని ప్రశంసించారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు.










