యనమదలలో అభివృద్ధి పనుల జాతర.. ఆనం రామనారాయణరెడ్డి కీలక ప్రసంగం.

0
1

చేజర్ల మండలం యనమదలలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతుల భూ హక్కులకు పటిష్ట రక్షణ కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

ఆధునిక క్యూఆర్ కోడ్ సాంకేతికతతో రూపొందించిన ఈ పుస్తకాలు రైతులకు పూర్తి భరోసా ఇస్తాయని తెలిపారు. ఇదే వేదికపై సూపర్ సిక్స్ పథకాల అమలును వివరిస్తూ, గ్రామంలో రూ.18 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించారు. దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో పాటు, స్థానిక సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.