గోదావరిఖనిలో జరిగిన బైక్ దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. బాధితుడు రేగుల వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మనోహర్ బృందం సీసీ ఫుటేజీని విశ్లేషించి నిందితుడిని పట్టుకున్నారు.
మార్చి 10న లక్ష్మీ నగర్ వద్ద చోరీకి గురైన ఫ్యాషన్ ప్రో బైక్ను రికవరీ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. బహిరంగ ప్రదేశాల్లో వాహనాలు పార్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
