మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ మండల రెవెన్యూ అధికారి (MRO) కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మీ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాములు, తెలంగాణ రాష్ట్ర ఎంబీసి (MBC) కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ పాల్గొన్నారు.
నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో మల్కాజిగిరి నియోజకవర్గం ముందుంటుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఆర్థిక వెసులుబాటు కల్పించినందుకు లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.
#sidhumaroju
Alwal










