అగ్ని బాధితులను పరామర్శించిన MLA సత్యప్రభ…

0
0

కాకినాడ జిల్లా
ప్రత్తిపాడు నియోజకవర్గం
శంఖవరం మండలం, జి.కొత్తపల్లి గ్రామంలో అగ్నిప్రమాద భాధితులను పరామర్శించిన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్య ప్రభ రాజా గారు. ఈ సందర్భంగా భాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించటమే కాకుండా వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. భాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్, టీడీపీ నాయకులు పర్వత సురేష్, AMC చైర్మన్ బద్ది రామారావు మణి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు
#dadala babji