చీరాల నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: 1,400 ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా!

0
0

చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సహకారంతో ఈ నెల 17 మార్చి 2026 (మంగళవారం) నాడు పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ లో భారీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేళాలో హెటిరో డ్రగ్స్, బిగ్ సి, ఎయిర్‌టెల్ వంటి 21 ప్రముఖ బహుళజాతి కంపెనీలు పాల్గొని 1,400కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి.

టెన్త్ నుండి పీజీ వరకు చదివిన 18-35 ఏళ్ల యువతీ యువకులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 నుండి రూ. 20,000 వరకు వేతనం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల నకలుతో నేరుగా హాజరుకావాలని అధికారులు సూచించారు.