తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను 3 స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లుగా (2026 ఫిబ్రవరిలో) విభజించింది. అవి: 1. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), 2. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), 3. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్,ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే,
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుతుబుల్లాపూర్ జోన్లు ఉన్నాయి.ఐటీ కారిడార్‌ను కలిగి ఉండటం వల్ల, ఇది తెలంగాణలో అత్యంత ధనిక పౌర సంస్థగా మారుతుందని అంచనా ,ముక్యంగా ఈ కార్పొరేషన్ పైన అన్ని రాజకీయ నాయకుల కన్నుపడింది,ఎవరికి వస్తుందో తెలియని పార్టీ టికెట్ కాని ,ఇందుకోసం, ఇప్పటికే కొందరు స్థానిక నాయకులు, రంజాన్ మాసము కావడం వల్ల ,ఇఫ్తార్ విందు ఇస్తూ ముస్లిం ఓటర్లు నీ ఆకట్టుకునే ప్రయత్నంచేస్తున్నారు, స్లమ్ ( మురికివాడ) ప్రాంతంలో పర్యటించి ,మహిళల కోసం ప్రత్యేకంగా చీరలు పంచుతు ,ప్రలోభాలు మొదలు పెట్టారు ,ఒక్కసారైనా ఈ కార్పొరేషన్ లో గెలిస్తే లైఫ్ సెట్ అవుతుందని భావిస్తున్న,గల్లి నాయకులు ప్రాంత సమస్యలు పట్టించుకోకుండా,
చీరలు పంచుంటే,సంతోషంగా తీసుకున్న మహిళలు,
వెళ్తూ వెళ్తూ ,ఎప్పుడొస్తుందో తెలియని ఎన్నికల కోసం మీరు “ఇస్తామంటే మేము వద్దంటామా”
అంటూ ఒకటి మొఖాలు ఒకరు చూస్తు నవ్వుతూ వెళ్ళిపోయారు చీర తీసుకున్న మహిళలు
