గ్యాస్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు మంత్రి అచ్చం నాయుడు

0
0

గల్ఫ్ యుద్ధ ప్రభావంతో నౌకల రవాణాకు ఆటంకం ఏర్పడి గ్యాస్ సరఫరాలో కొంత ఇబ్బంది తలెత్తిందని, అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు.

విజయవాడలో చమురు సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో, గ్యాస్ ఉత్పత్తిని 20% పెంచాలని కేంద్రం రిఫైనరీలను ఆదేశించినట్లు వారు తెలిపారు.

వంట గ్యాస్‌కు ఇబ్బంది లేకుండా ఆసుపత్రులు, హాస్టళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని, పైప్డ్ గ్యాస్ వినియోగాన్ని పెంచుతామని పేర్కొన్నారు. ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.