పుంగనూరు: వైసీపీ ఆవిర్భావ వేడుకలో పెద్దిరెడ్డి

0
0

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం 16వ వైసీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందని, గత వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు మెరుగైన పాలన అందించామని పెద్దిరెడ్డి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.