మహిళా సాధికారతకు ‘తానా’ చేయూత: 100 మందికి కుట్టుమిషన్ల పంపిణీ

0
0

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తానా (TANA) ట్రెజరర్ కసుకుర్తి రాజా ఆర్థిక సాయంతో, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, గద్దె అనురాధ పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో ఆయన మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొంది కుటుంబానికి అండగా నిలవాలని, ప్రభుత్వ ‘స్వయం’ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.