Home South Zone Andhra Pradesh మాజీ కౌన్సిలర్ కుటుంబంపై దాడి: చర్యలు తీసుకోవాలని డిమాండ్.

మాజీ కౌన్సిలర్ కుటుంబంపై దాడి: చర్యలు తీసుకోవాలని డిమాండ్.

0

మదనపల్లె మాజీ కౌన్సిలర్ సిద్ధమ్మ, సత్యనారాయణ, రేవతి శుక్రవారం తమకు ఎదురవుతున్న ముప్పు గురించి మీడియాకు వివరించారు. వేములయ్య తన అనుచరులతో వచ్చి తమ ఇంటిపై దాడి చేశారని, తనను మరియు తన పిల్లలను కొట్టి భయభ్రాంతులకు గురిచేశారని సిద్ధమ్మ ఆరోపించారు. ఘటన జరిగి 15 రోజులవుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తూ, విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని, ప్రాణ భయంతో కాలం గడుపుతున్నామని బాధితులు పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version